Monday, July 4, 2011

Praanamina premaku

జీవించే ఉన్నానా జవసత్వలున్నాయని జిలి బిలి ఈ వెలుగుల వెంట 
వడి వడి గా నడిచితినే 
విలువ తెలుసు వయసుకెదిగి వయసు విలువ నే మరచితి 
మరణమనే మర్మం ఎరుగ మరచితినే మనసు నిలువ 

ఈ పయనం ఎటు చేరను?
ఏ కాంక్షను పూరించను?

నీ వెచ్చని శ్వాసలలో ఆ జాబిలి సొంతమాయే
నువ్ లేని నన్ను చూసి మిణుగురును వీడిపోయే

ప్రేమన్నది తెలిసిందా నువ్ సాంతముండగా
పలుకైనా పరుగైనా నీ తలపుల నెచ్చెలిని 

నా చెంత చేర్చునట్టి 
ఈ తేనెల పలుకులనే 

శ్వాషిస్తూ సాగెదను
ఈ గమనం సాగించెదను







No comments:

Post a Comment